ఫుల్ గా తాగేసి.. దొంగతనానికి వెళ్లి
మద్యం మత్తులోనే దొంగతనం చేయాలని వెళ్ళాడు ఓ ఘనుడు.
మద్యం మత్తులోనే దొంగతనం చేయాలని వెళ్ళాడు ఓ ఘనుడు. అలా వెళ్ళాక మైకం వచ్చిందో ఏమో!! చోరీ చేయాలని వెళ్లిన ఇంట్లోనే ఫుల్ గా బజ్జున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని నజీరాబాద్ పోలీస్టేస్టే షన్ పరిధిలో చోటుచేసుకుంది. మర్యంపూర్ రైల్వే లైన్లోని పక్కపక్కనే ఉన్న ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లలోకి అర్ధరాత్రి వేళ చొరబడ్డాడు. వినోద్ కుమార్ ఇంటి కిటీకీలను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, విలువైన వస్తువులను కాజేశాడు. రెండిళ్లకూ మధ్యన ఉన్న తలుపును విరగ్గొట్టి అనిల్ కుమార్ ఇంట్లోకి ప్రవే శించాడు. బీరువా తెరిచి బంగారు నగలను దోచేసి.. అక్కడే నిద్రపోయాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న అనిల్ వేకువజామున ఇంటికి వచ్చి దొంగను చూశాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా పోలీసుల ఎంట్రీనే!!