Sharad Mohol: గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్ దారుణ హత్య.. చంపింది ఎవరంటే?
పూణేకు చెందిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ ను దారుణంగా
Gangster Sharad Mohol
Sharad Mohol: పూణేకు చెందిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ ను దారుణంగా చంపేశారు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు, 40 సంవత్సరాల వయస్సు గల మోహోల్‌పై ముగ్గురు నుండి నలుగురు దుండగులు మెరుపుదాడి చేశారని, వారు అతనిపై సమీపం నుండి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతీని తాకగా, మరో రెండు బుల్లెట్లు అతని కుడి భుజానికి తగిలాయి. అత్యవసర చికిత్స కోసం కోత్రుడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మోహోల్ ప్రాణాలతో బయటపడలేదు. అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారని PTI నివేదించింది.
కొత్రుడ్‌లోని సుతార్ దారా ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం మొహోల్‌పై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌లో తలెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మూడు పిస్టల్స్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. మోహోల్‌పై హత్య, దోపిడీకి సంబంధించిన పలు కేసులు ఉన్నాయి. మొహోల్‌ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శరద్ మోహోల్ క్రిమినల్ అండర్ వరల్డ్‌లో సుప్రసిద్ధ వ్యక్తి, అతనిపై హత్య, దోపిడీతో సహా పలు కేసులు ఉన్నాయి. అతను గతంలో ఎరవాడ జైలులో అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్త మహ్మద్ ఖతీల్ సిద్ధిఖీని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.