అంత్యక్రియలకు వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు నలుగురు అన్నదమ్ములు
ఐదురోజుల క్రితం స్వగ్రామమైన చౌటపల్లిలో బంధువైన ఎరుకల కనకయ్య మరణించడంతో.. అతని అంత్యక్రియలకు..
four brothers died in aurangabad road accident
మృత్యువు ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో కబళిస్తుందో తెలియదు. అందుకే ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపోటపుడు జాగ్రత్త తీసుకోవాలి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చౌటపల్లికి చెందిన ఎరుకల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసు గా గుర్తించారు.
నలుగురు అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారు. కుటుంబాలతో కలిసి అక్కడే స్థిరపడ్డారు. ఐదురోజుల క్రితం స్వగ్రామమైన చౌటపల్లిలో బంధువైన ఎరుకల కనకయ్య మరణించడంతో.. అతని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో సహా స్వగ్రామానికి వచ్చారు. కుటుంబ సభ్యులను అక్కడే ఉంచి నలుగురు అన్నదమ్ములు తిరిగి సూరత్ కు కారులో బయల్దేరారు. నిన్న రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరుగుపయనంలో నలుగురు అన్నదమ్ములు ప్రమాదంలో చనిపోవడంతో చౌటపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.