మలక్ పేట్ లో కాల్పులకు పాల్పడింది వారేనట
మలక్ పేట్ లో చందూ రాథోడ్ పై కాల్పులకు పాల్పడింది ఐదుగురు వ్యక్తులని తేలింది
మలక్ పేట్ లో కాల్పులకు పాల్పడింది ఐదుగురు వ్యక్తులని తేలింది. మలక్ పేట్ లోని శాలివాహన్ నగర్ కాలనీలో చందు రాథోడ్ వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. నాగర్ కర్నూలు అచ్చంపేట్ కు చెందిన చందరాథోడ్ సీపీఐ పార్టీ నేతగా ఉన్నారని తెలిసింది. అయితే చందు రాథోడ్ తన స్నేహితులతో కలసి వాకింగ్ చేస్తుండగా, అతని కళ్లల్లో కారం చల్లి దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయినట్లు తెలిసింది.
భూ వివాదాలే...
చందూ రాథోడ్ కాల్పుల్లో అక్కడికక్కడే మరణించారు. అతని స్నేహితులతోకలసి ప్రతి రోజూ శాలినగర్ లో వాకింగ్ చేస్తారని ముందుగా రెక్కీ చేసిన దుండగులు ఉదయాన్నే షిఫ్ట్ కారులో వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అయితే కాల్పులకు భూ వివాదాలే కారణమని ప్రాధమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే చందు రాథోడ్ బంధువులు మాత్రం ఆయనకు శత్రువులు ఎవరూ లేరని చెబుతున్నప్పటికీ, భూ వివాదాలే కారణమయి ఉంటాయని భావించి సిటీ నాలుగు మూలల పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.