ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు
kerala road accident
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయాలు పాలయిన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పొగమంచు కారణమే...
అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పొగమంచు కారణంగా కూడా ఎదురుగా ఉన్న వాహనం కన్పించక ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.