Delhi : ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నలుగురు గ్యాంగ్ స్టర్లు ఈ ఎన్ కౌంటర్ లో మరణించారు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నలుగురు గ్యాంగ్ స్టర్లు ఈ ఎన్ కౌంటర్ లో మరణించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. వీరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, గాంగ్ స్టర్లుగా రికార్డులకు ఎక్కారు. అయితే ఈ గ్యాంగ్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రంజన్ పాఠక్ ఉన్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు నలుగురు స్పాట్ లోనే మరణించారు.
నలుగురు గ్యాంగ్ స్టర్లు...
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో పాటు బీహార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతులు నలుగురు సిగ్మా గ్యాంగ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారని తెలిసింది. అయితే ఏ సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయంపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.