జయత్రి ఇన్‌ఫ్రా ఎండీ అరెస్ట్

జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాకర్ల శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు

Update: 2025-12-19 04:41 GMT

జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాకర్ల శ్రీనివాస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. సుమారు300 కోట్ల ప్రీ-లాంచ్‌ రియల్‌ ఎస్టేట్‌ మోసం కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈడీ కేసు నమోదు చేసిన వెంటనే శ్రీనివాస్‌ పరారీలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అనంతరం చెన్నైలో ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.

ఇళ్ల పేరుతో వసూళ్లు....
నివాస ప్రాజెక్టుల పేరుతో ప్రీ-లాంచ్‌ స్కీములు చూపించి శ్రీనివాస్‌ గృహ కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఈడీ గుర్తించింది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత హామీ ఇచ్చిన ఇళ్లు ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు దర్యాప్తులో సుమారు 300 కోట్లను అక్రమంగా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఆ మొత్తాన్ని హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో పెట్టకుండా ఇతర అవసరాలకు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనివాస్‌ను త్వరలోనే కోర్టులో హాజరు పరచనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ మోసంలో మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.











Tags:    

Similar News