వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
వరంగల్ లో దాడికి గురైన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు.
వరంగల్ లో దాడికి గురైన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత నెల 20వ తేదీన సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. సుమంత్ రెడ్డి భార్య మరియా తో పాటు శామ్యూల్, నాగరాజులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు. అయితే తలపై బలంగా కొట్టడంతో సుమంత్ రెడ్డి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
వివాహేతర సంబంధమే...
వివాహేతర సంబంధానికి అడ్డొస్తారని భావించి భార్య మరియా సుమంత్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన సుమంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.