Hyderabad : ఫాం హౌస్ పై హైదరాబాద్ పోలీసులు దాడి

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని ఒక ఫాంహౌస్‌లో సైబరాబాద్‌ పోలీసులు దాడి చేశారు

Update: 2025-09-29 07:43 GMT

 Telangana police

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని ఒక ఫాంహౌస్‌లో సైబరాబాద్‌ పోలీసులు దాడి చేశారు. అక్కడ 51మంది విదేశీయులు ఒక బర్త్‌డే పార్టీ జరుపుకుంటున్నట్టు గుర్తించారు. ఆ పార్టీకి అనుమతి తీసుకోకపోవడమే కాకుండా, శబ్దం చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిలో 37మంది మహిళలు ఉన్నారు. వీరిలో 37మంది ఉగాండా, ఇద్దరు నైజీరియా, ముగ్గురు లైబీరియా, అలాగే బోట్స్వానా, కెన్యా, కేమరూన్‌, మోజాంబిక్‌, జింబాబ్వే, ఘనా, మలావి దేశాలకు చెందిన వారు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

విదేశీయులు...
తదుపరి డాక్యుమెంట్లను పరిశీలించగా 36మంది చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా అక్రమంగా భారత్‌లో ఉంటున్నట్టు తెలిసింది. వారిలో ఏడుగురు పురుషులు, 29మంది మహిళలు ఉన్నారు. ఈమేరకు పోలీసులు విజ్ఞప్తి చేయడంతో, హైదరాబాదు ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు వారికి మూవ్‌మెంట్‌ రిస్ట్రిక్షన్‌ ఆర్డర్లు జారీ చేశారు. అనంతరం వారిని సురక్షితంగా సైబరాబాద్‌, హైదరాబాదులోని డిటెన్షన్‌ కేంద్రాలకు తరలించారు.


Tags:    

Similar News