సెల్ టవర్ ను ఎత్తుకెళ్లారు.. ఎలా తెలిసిందంటే..?

Update: 2022-11-12 08:14 GMT

మహారాష్ట్రలో దొంగలు ఏకంగా ఓ సెల్ టవర్ ను ఎత్తుకెళ్లడం సంచలంగా మారింది. భారీ టవర్ ను పార్టులు పార్టులుగా విడదీసి సైలెంట్ గా మొత్తం కాజేశారు. మహారాష్ట్రలోని వాలూజ్ లో ఈ దొంగతనం చోటు చేసుకుంది. ఈ దొంగతనం కారణంగా సదరు మొబైల్ కంపెనీకి దాదాపు రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లింది.

జీటీఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వాలూజ్ లో ఓ సెల్ టవర్ ఏర్పాటు చేసింది. 2009లో కొంత స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకుని, అందులో ఈ టవర్ ను ఏర్పాటు చేసింది. ఆ భూమి యజమానికి నెల నెలా రూ.9500 అద్దె చెల్లించేది. పదేళ్ల గడువు పూర్తికాక ముందే 2018లో సదరు భూమి యజమాని జీటీఎల్ కంపెనీని ఖాళీ చేయించాడు. ఆ తర్వాత ఆ టవర్ ను జీటీఎల్ సంస్థ పట్టించుకోలేదు. వాలూజ్ చుట్టుపక్కల ఏరియాకు జీటీఎల్ కంపెనీ కొత్త ప్రతినిధిగా అమర్ లాహోత్ ను నియమించింది. బాధ్యతలు చేపట్టిన లాహోత్ వాలూజ్ లో తమ కంపెనీ టవర్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ టవరే కనిపించలేదు. గతంలో అక్కడొక టవర్ ఉండేదనేందుకు సాక్ష్యంగా కొన్ని పరికరాలు మాత్రం కనిపించాయి. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సదరు కంపెనీ కోర్టు మెట్లెక్కింది.


Tags:    

Similar News