సిసొడియాపై కేసు నమోదు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు

Update: 2022-08-19 13:06 GMT

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సిసోడియాతో పాటు పది హేను మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును కూడా చేర్చారు. హైదరాబాద్, బెంగళూరులోని రామచంద్ర పిళ్లై కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఇండో స్పిరిట్ పేరుతో లిక్కర్ వ్యాపారాన్ని రామచంద్ర పిళ్లై నిర్వహిస్తున్నారు.

2.50 కోట్లు తీసుకున్నారని...
టెండర్ దక్కించుకోవడానికి అరుణ్ పాండ్యా ద్వారా డబ్బులు వసూలు చేసినటలు సీబీఐ గుర్తించింది. అతని నుంచి 2.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. బెంగళూరు కేంద్రంగా వ్యాపారం చేస్తున్న రామచంద్ర పిళ్లైను ఈ కేసులో ఏ 14గా చేర్చారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును ఏ 1 గా చేర్చారు. ఈరోజు ఉదయం నుంచి మనీష్ సిసొడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తునన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 21 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. మద్యం పాలసీ ద్వారా అవకతవకలు జరిగాయని సీబీఐ అధికారులు ఈ సోదాల్లో గుర్తించారు.


Tags:    

Similar News