ఎలుకను చంపితే మర్డర్ కేసు

ఎలుకను చంపిన యువకుడిపై మర్డర్ కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది

Update: 2023-04-12 04:13 GMT

ఎలుకను చంపిన యువకుడిపై మర్డర్ కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని బదాయూలో ఒక యువకుడు ఎలుక తోకకు రాయి కట్టి నీళ్లలో ముంచి చంపారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ముప్ఫయి పేజీల ఛార్జిషీట్ వేశారు. గత ఏడాది నవంబరులో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యంలో ముంచెత్తుంది.

పోస్టుమార్టం నివేదికలోనూ...
ఉత్తరప్రదేశ్ లోని కల్యాణనగర్ కు చెందిన మనోజ్ కుమార్ ఎలుక తోకకు రాయి కట్టి కాలవలో ముంచడంతో ఎలుక చనిపోయింది. ఈ క్రమంలో అందిన ఫిర్యాదు మేరకు మనోజ్ పై ఐపీీసీ సెక్షన్ 429 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. జంతుహింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించగా ఎలుకను నీటిలో ముంచడం వల్ల ఊపిరాడక చనిపోయిందని తేలింది. అప్పటికే ఎలుక అనారోగ్యంతో ఉందని కూడా పశువైద్యాధికారులు తెలిపారు. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.


Tags:    

Similar News