ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. సజీవ దహనం

కారు, లారీని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అందులో ఉన్న మెట్పల్లి కి చెందిన ఇద్దరు వ్య‌క్తులు అనిల్ (26), సుమన్ (25) సజీవ దహనం అయినట్టు తెలిపారు.

Update: 2022-06-27 13:51 GMT

నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఉద‌యం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ జాతీయ రహదారిపై వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక సుమారు 1:30 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మెట్ పల్లి వైపు నుండి వ‌స్తున్న ఆల్టో (TS21B 6446) కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు, లారీని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అందులో ఉన్న మెట్పల్లి కి చెందిన ఇద్దరు వ్య‌క్తులు అనిల్ (26), సుమన్ (25) సజీవ దహనం అయినట్టు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, వేల్పూర్ ఎస్సై వినయ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. లారీని కారు ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు సజీవదహనమయ్యారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


దగ్ధమైన ఆర్టీసీ బస్సు:
ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ లగ్జరీ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్‌ వస్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద బస్సులో షార్ట్‌సర్య్కూట్‌ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు అందరినీ బస్సులో నుంచి దించివేయడంతో భారీ ప్రమాదం తప్పిపోయింది.


Tags:    

Similar News