Kurnool Bus Accident : బస్సు ప్రమాదానికి ముందే శివశంకర్ మృతి?

కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు

Update: 2025-10-25 07:34 GMT

కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడిని అతని స్నేహితుడు ఎర్రిస్వామిగా గుర్తించారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని ఎర్రిస్వామి తెలిపినట్లు తెలిసింది. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉండగా చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డారని ప్రాధమికంగా తేలింది. ఈ ప్రమాదంలో శివశంకర్ రోడ్డు మధ్యలో బైక్ తో పాటు పడిపోయాడని, రోడ్డు మీద శివశంకర్‌, ఎర్రిస్వామి చెరో వైపు పడిపోయారని విచారణలో తేలింది.

డివైడర్‌ను ఢీకొట్టడంతో...
డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్‌ తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లో మృతి చెందినట్లు తేలింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి భయంతో పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో ప్రాధమికంగా తేలింది. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లింది. పందొమ్మిది ప్రయాణికుల మృత్యువుకు కారణమయింది. సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్న పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈరోజు మీడియాకు వివరాలు తెలిపే అవకాశముంది.


Tags:    

Similar News