Murder Case : నమ్మించి అడవుల్లోకి తీసుకెళ్లి గొంతుకోసి.. పెట్రోలు పోసి తగులబెట్టి
నల్లమల అడవుల్లో దారుణం చోటు చేసుకుంది. భార్య శ్రావణిని దారుణంగా హత్యచేసిన భర్త శ్రీశైలం నిప్పటించిన ఘటన జరిగింది.
నల్లమల అడవుల్లో దారుణం చోటు చేసుకుంది. భార్య శ్రావణిని దారుణంగా హత్యచేసిన భర్త శ్రీశైలం నిప్పటించిన ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారంనాగర్ కర్నూలు జిల్లాకు చెందిన తన భార్య శ్రావణనిని సోమశిల వెళదామని చెప్పి తీసుకెళ్లిన శ్రీశైలం దారుణంగా హత్య చేశాడు. తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో ఆమెను తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని, అదే హత్యకు దారితీసిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. మృతదేహాన్ని పెట్రోలు పోసి తగులపెట్టడంతో పోలీసుల అటవీ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని...
శ్రావణి, శ్రీశైలం లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాటి నుంచి శ్రీశైలం శ్రావణని అనుమానిస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారింది. శ్రావణని అంతమొందించాలని నెల రోజుల క్రితమే పథకం వేశాడు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో ఒక రంపం కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య శ్రావణికి ఆమె బావతో వివాహేతర సంబంధం ఉందని భావించిన శ్రీశైలం ఆమెను హతమార్చాలని నిర్ణయించుకుని పక్కా ప్లాన్ తో టూర్ కు వెళదామని నమ్మించి శ్రావణని తీసుకెళ్లాడు.
అనుమానం పెంచుకుని...
భార్య శ్రావణిపై గత కొంత కాలం నుంచి అనుమానం పెంచుకున్న శ్రీశైలం సోమశిల వెళ్దామని చెప్పి నల్లమల అటవీ ప్రాంతానికి శ్రీశైలం తీసుకెళ్లాడు. అక్కడశ్రావణి గొంతుకోసి చంపిన భర్త శ్రీశైలం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగల బెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో శ్రావణి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే తానే భార్య శ్రావణని హత్య చేసినట్లు శ్రీశైలం అంగీకరించినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించి ఆ దిశగా దర్యాప్తును ప్రారంభించారు.