బ్రేక్ కు బదులు యాక్సిలేటర్ తొక్కడంతో బాలుడు మృతి

యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ బ్రేక్ కు బదులు యాక్సిలేటర్ పై కాలు పెట్టడంతో ఒక బాలుడు మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది

Update: 2025-05-19 13:22 GMT

యువతి డ్రైవింగ్ నేర్చుకుంటూ బ్రేక్ కు బదులు యాక్సిలేటర్ పై కాలు పెట్టడంతో ఒక బాలుడు మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రెడ్డి గూడెంలో స్థానిక మైదానంలో ఆడుకుంటున్న అక్కాతమ్ముడిని కారు నేర్చుకుంటున్న ఒక యువతి ఢీకొట్టింది. కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ మైదానంలోకి రావడంతో కంగారులో బ్రేక్ కు బదులు యాక్సిలేటర్ పైన కాలువేయడంతో వేగంగా దూసుకెళ్లి అక్కాతమ్ముడిని ఢీకొట్టింది.

పోలీసు అదుపులో యువతి
ఈ ప్రమాదంలో పదేళ్ల వయసున్న మణివర్మ మరణించగా, పథ్నాలుగేళ్ల వాణికి తీవ్ర గాయలయ్యాయి. వాణిని ఆసుపత్రిలో చేర్చిచికిత్స అందిస్తున్నారు. బాలుడు మరణించడంతో వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.


Tags:    

Similar News