పాస్ వర్డ్స్ విషయంలో జాగ్రత్త.. మీ కంపెనీయే లేకుండా పోతుంది
పాస్ వర్డ్ విషయంలో నిర్లక్ష్యం కారణంగా 158 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సంస్థ మూతపడేలా చేసింది.
పాస్ వర్డ్ విషయంలో నిర్లక్ష్యం కారణంగా 158 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సంస్థ మూతపడేలా చేసింది. 700 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. పాస్ వర్డ్ పటిష్ఠంగా లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు కంపెనీ సిస్టమ్ లోకి ఎంటరై కీలకమైన సమాచారాన్ని తమ నియంత్రణలో పెట్టుకున్నారు. యూకేకు చెందిన ప్రఖ్యాత లాజిస్టిక్ కంపెనీ ‘కె.ఎన్.పీ లాజిస్టిక్’ విషయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కంపెనీకి చెందిన 500 లారీలు నిత్యం కస్టమర్ల సరుకులను దేశవిదేశాలకు చేరవేస్తుంటాయి. ‘నైట్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్’ పేరుతో ఈ లారీలు తిరుగుతుంటాయి. ఇటీవల కంపెనీ ఉద్యోగులలో ఒకరి పాస్ వర్డ్ ను ఊహించిన హ్యాకర్లు కేఎన్ పీ సిస్టంలోకి ఎంటరయ్యారు. ఇక హ్యాకర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ ఉండడంతో అంత మొత్తం ఇచ్చుకునే పరిస్థితిలో సంస్థ లేదు. దీంతో కంపెనీని మూసేయాలని నిర్వాహకులు అనుకుంటూ ఉన్నారు. కంపెనీ మూతపడితే సంస్థలోని 700 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.