భారత యువకుడిని కాల్చిన పోలీసులు

బోర్డింగ్ వీసాపై ఉంటున్న ఒక భారతీయుడిపై కాల్పులు జరపడంతో ఆ యువకుడు మృతి చెందాడని ఆస్ట్రేలియా పోలీసులు చెబుతున్నారు

Update: 2023-03-01 07:14 GMT

ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మరణించిన ఘటన వెలుగు చూసింది. బోర్డింగ్ వీసాపై ఉంటున్న ఒక భారతీయుడిపై కాల్పులు జరపడంతో ఆ యువకుడు మృతి చెందాడని ఆస్ట్రేలియా పోలీసులు చెబుతున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన రహ్మతుల్లాగా గుర్తించారు. రహ్మతుల్లా వయసు 32 సంవత్సరాలు. అయితే సిడ్నీ రైల్వే స్టేషన్ లో రహ్మతుల్లా ఒక క్లీనర్ ను కత్తితో పొడిచాడని, అనంతరం పోలీసులపై తిరగబడ్డాడని ఆస్ట్రేలియా పోలీసులు చెబుతున్నారు.

పోలీసులపై దాడికి దిగడంతో...
మహ్మద్ రహ్మతుల్లా సిడ్నీ స్టేషన్ లో క్లీనర్ ను పొడిచిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ పోలీసు అధికారిపై తిరగబడటంతో అక్కడ అధికారి రహ్మతుల్లాపై మూడు రౌండ్ల పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో రహ్మతుల్లా చనిపోయారు. దీనిపై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళతామని తెలిపింది.


Tags:    

Similar News