America : అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ లోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వద్ద కాల్పులు జరిగాయి

Update: 2025-09-25 04:45 GMT

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ లోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తిని జోషువా జాన్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

గాయపడిన ఇద్దరి పరిస్థితి...
అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి అని పోలీసులు తెలిపారు. కాల్పులు విచక్షణ రహితంగా జరపడంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారని, వెంటనే పోలీసులు వచ్చారని తెలిపారుు.


Tags:    

Similar News