Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. కత్తితో పొడిచి మరీ?

హైదరాబాద్ లో మరొక హత్య సంచలనం కలిగించింది.

Update: 2025-12-15 06:28 GMT

హైదరాబాద్ లో మరొక హత్య సంచలనం కలిగించింది. టౌలిచౌకిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఘర్షణను అడ్డుకోపోవడంతో ఆ యువకుడిని కత్తితో పొడవడంతో అతను చనిపోయాడు. టోలీచౌకిలో బిలాల్, అద్నాన్ లు సోదరులు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది.

అన్నదమ్ములు గొడవ పడుతుండగా...
ఇద్దరు ఘర్షణ పడుతుండగా అక్కడే ఉన్న ఇర్ఫాన్అక్కడకు వెళ్లి వారిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకోవడానికి చూశాడు. గొడవ ఆపే ప్రయత్నంలో ఇద్దరినీ విడదీశాడు. అయితే దీనిపై ఆగ్రహంచిన బిలాల్ ఇర్ఫాన్ ను కత్తితో పొడిచాడు. దీంతో ఇర్ఫాన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇర్ఫాన్ ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News