Encounter : ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ మావోయిస్టు అగ్రనేత మృతి చెందారు

Update: 2024-02-09 05:51 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ మావోయిస్టు అగ్రనేత మృతి చెందారు. సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు అగ్రనేత మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టును డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

గాలిస్తుండగా...
సుక్మా-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బృందాలు మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా మావోెయిస్టులు భద్రతాదళాలకు ఎదురుపడ్డారు. పోలీసులు కనిపించగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. చంద్రన్నపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రితో పాటు ఎకె47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News