ఆంధ్రప్రదేశ్ లో లేడీ డాన్ లు హల్ చల్.. ఖతర్నాక్ లేడీలతో కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ లో లేడీడాన్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు.

Update: 2025-12-27 06:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో లేడీడాన్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న వారు బాస్ లుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నంచి మదనపల్లె వరకూ ఈ లేడీడాన్ లు విస్తృతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నేరాలను ప్రత్యక్షంగా ప్రోత్సహించడమే కాకుండా గ్యాంగ్ లను నడుపుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా మదనపల్లెలోనూ లేడీ డాన్ కలకలం రేపుతుంది. వీరు భూకబ్జాలు చేయడం, ప్రయివేటు సెటిల్ మెంట్లు చేయడంలో కీలకంగా మారారు. లేడీ డాన్ లపై పోలీసులు రౌడీషీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు. అయినా ఏపీలో లేడీడాన్ ల సంస్కృతి ఇటీవల కాలంలో పెరిగిందని పోలీసు వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

భూ కబ్జాలు.. సెటిల్ మెంట్లు...
లేడీ డాన్ లు భూ సెటిల్ మెంట్లతో పాటు హత్యలకు కూపడా స్కెచ్ లు వేస్తున్నారు. ఈ ఖతర్నాక్ లేడీలు ఒకరిని లేపేయాలంటే సులువుగా చేసేస్తున్నారు. గంజాయి సరఫరా కూడా చేసి రెండు చేజేతులా ఆర్జిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో ఇద్దరు లేడీ డాన్ ల వ్యవహరం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నెల్లూరులో గంజాయి కేసుల్లో అడ్డుపడుతున్నందుకు సీపీఎం నాయకుడు పెంచలయ్య ను హత్య చేయించింది అరవ కామాక్షిగా పోలీసులు గుర్తించారు. అంతకు ముందు మరో లేడీ డాన్ అరుణ అనేక కేసుల్లో ఇరుక్కుని జైలు ఊచలు లెక్కిస్తుంది. ఈ లేడీ డాన్ లు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలను పెంచుకుని యధేచ్ఛగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ లేడీ డాన్ పై కేసు నమోదు చేసిన మదనపల్లె పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
మదనపల్లెలో వందల కోట్ల విలువైన...
తాజాగా మదనపల్లెలో మరొక లేడీ డాన్ విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రయివేటు సైన్యంతో బెదిరించి వందల కోట్ల భూములను తమ సొంతం చేసుకున్నారు. దాదాగిరీ చేస్తూ మదనపల్లె ప్రజలను వణికిస్తున్న ఈ లేడీడాన్ పై పోలీసులు రౌడీషీట్ తెరిచారరు. భూములను కాజేయడమే కాకుండా వారిని బెదరించి అవసరమైతే లేపేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తుండటంతో పోలీసుల ఆమెపై పద్దెనిమిది కేసులు నమోదు చేశారు. ఈ పద్దెనిమిది కేసుల్లో ఆమెను విచారించేందుకు మదనపల్లె పోలీసులు సిద్ధమవుతున్నారు. బాధితులు మదనపల్లె పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. పోలీసులు ఈ లేడీడాన్ పై సత్వరం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




Tags:    

Similar News