Road Accident : అతిగా మద్యం.. హై స్పీడ్.. ముగ్గురు యువకుల స్పాట్ డెడ్

మద్యాన్ని అతిగా సేవించి బైకుతో గోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మరణించారు

Update: 2025-12-23 04:47 GMT

మద్యంమత్తు ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. మద్యాన్ని అతిగా సేవించి బైకుతో గోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యాన్ని సేవించి బైకుపై వెళుతున్న ముగ్గురు యువకులు గోడను ఢీకొట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాల్లో...
అతి వేగంతో వచ్చి బైకు ఢీకొట్టడంతో బలంగా తగలడంతో అక్కడికక్కడే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతిగా మద్యంసేవించడంతో పాటు హైస్పీడ్ ముగ్గురు యువకుల ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News