Vijayawada : బెజవాడలో దారుణం..మద్యానికి పది రూపాయలు ఇవ్వనందుకు మర్డర్
మద్యం సేవించేందుకు పది రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని హత్య చేశాడు. విజయవాడ కొత్తపేటలో ఈ దారుణ ఘటన జరిగింది
మద్యం సేవించేందుకు పది రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని హత్య చేశాడు. విజయవాడ కొత్తపేటలో ఈ దారుణ ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే తాతాజీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మందు తాగడానికి 10 రూపాయలు ఇవ్వలేదని వృద్ధుడిని బాలుడు హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత స్టేషన్ లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనలో పోలీసుల కథనం ప్రకారం....చిట్టినగర్ లౌక్య బార్ దగ్గర గురువారం రాత్రి 11:30 నిముషాలకు బాలుడు తాగిన మత్తులో మందు కి డబ్బులు సరిపోలేదు అని వృద్ధుడు తాత అబ్బాయి ని 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదు అని కత్తితో దాడి చేశాడు.
తాతబ్బాయి...
వృద్ధుడు తాత అబ్బాయి తాపీ పని చేసుకొని జీవనం సాగిస్తాడు. వృద్ధుడు తాత అబ్బాయి మంగళగిరి నులక పేట ప్రాంతంలో ఉండేవాడు. పనికోసం విజయవాడ లో జీవనం సాగిస్తున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని చికిత్స అందిద్దామని గవర్నమెంట్ హాస్పిటల్ తరలించే లోపే వృద్ధుడు మృతి చెందాడు.నిందితుడిని కెమెరాలు ఆధారంగా పట్టుకునే పనిలో పోలీసులు ఉండగా బాలుడు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.