సైఫ్ ఆలీఖాన్ పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్?

బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌ అయినట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం

Update: 2025-01-19 03:28 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌ అయినట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిందితుడు గా తొలుత గుర్తించినా అసలు పేరు మహ్మద్ సాజిద్ గా తెలిపారని పోలీసులు చెప్పారు. నిందితుడు తాను నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలపడంతో సైఫ్ ఆలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లయింది.

ఎందుకు దాడి చేశాడంటే?
నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. మరొకవైపు ధానే లో అరెస్ట్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది. నిందితుడి కోసం ముంబై నుండి ఛత్తీస్‌గఢ్‌ బయల్దేరిన పోలీసులు అతనిని ముంబయికి తీసుకు వచ్చి వివరాలను తెలుసుకోనున్నారు. అయితే ఎందుకు ఈ నేరం చేశాడు? దాడి చేయడంలో అతని లక్ష్యమేమిటన్న వివరాలను పోలీసులు తెలుసుకోనున్నారు.


Tags:    

Similar News