శివకాశీలో పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. శివకాశీలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి ఐదుగురు మరణించారు.

Update: 2025-07-01 05:14 GMT

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. శివకాశీలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి ఐదుగురు మరణించారు. బాణసంచా తయారీ చేస్తుండగా పెద్దయెత్తున పేలుడు సంభవించిందని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. బాణ సంచాతయారు చేసే ఇల్లు కూడా ధ్వంసమయింది. బాణ సంచా తయారీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బాణసంచా తయారు చేస్తుండగా...
మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని చెబుతున్నారు. బాణసంచా తయారు చేస్తుండగా వత్తిడికి పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదాలు ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News