America : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మరణించాడు.

Update: 2025-10-07 02:02 GMT

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. హైదరాబాద్ లోని చంచల్ గూడకు చెందిన షేరాజ్ మెహతాబ్ మహ్మద్ చికాగోలోని ఇవాన్సటన్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఇతని కుటుంబ సభ్యులు చాలా రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. వీకెండ్ బయటకు రావడంతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు చెబుతున్నారు.

చంచల్ గూడ బస్తీకి చెందిన...
చంచల్ గూడ బస్తీకి చెందిన అల్తాఫ్ మహ్మద్ ఖాన్ కుమారుడు మహ్మద్ కొన్నాళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వెళ్లారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెహతాబ్ మహమ్మద్ మరణించడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని వయసు ఇరవై ఐదేళ్లు. నిన్ననే అతని అంత్యక్రియలను అమెరికాలో కుటుంబ సభ్యులు నిర్వహించారని చెబుతున్నారు.


Tags:    

Similar News