కట్టుకున్న చీరే ఉరి తాడైంది.. మెషిన్‌లో చీర చుట్టుకుని మహిళ మృతి

మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. అప్పటి వరకు పనులు చేసుకుంటూనే, ఆనందంగా గడుపుతూనో..

Update: 2023-10-29 05:16 GMT

మృత్యువు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. అప్పటి వరకు పనులు చేసుకుంటూనే, ఆనందంగా గడుపుతూనో ఉన్నవారు ఎందరో అకస్మాత్తుగా మృత్యువు కబలిస్తుంటుంది. ఉన్నట్టుండి మృతువు వెంటాడుతుండటం అందరికి కలచివేస్తుంటుంది. తాజాగా అనంతపురంలో జరిగిన ఘటన అందరికి కలచివేసింది. కట్టుకున్న చీరే ఆమెకు ఉరితాడుగా మారిన ఘటన బుక్కరామసముద్రంలో చోటు చేసుకుంది. పప్పుల మిల్లులో పనిచేస్తున్న ఓ కార్మికురాలు నగ్మా (30) చీర మిషన్ లో చుట్టుకొని చనిపోయింది. మిల్లులో పనిచేస్తుండగా ఆమె చీర మిషన్ లో పడడంతో చీరే ఉరితాడుగా మారిపోయింది. మహిళా కార్మికురాలు నగ్మా చీర మిషన్ కు చుట్టుకోవడంతో వెంటనే ఆమె మెడ చుట్టూ ఊరిలాగా బిగుసుకుపోయింది.

దీంతో మహిళా కార్మికురాలు అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియకుండా మిల్లు యాజమాన్యం దాచి పెట్టారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.



Tags:    

Similar News