పులి దాడిలో వ్యక్తి మృతి

అసిఫాబాద్ జిల్లాలో పులి దాడి లో ఒక వ్కక్తి మృతి చెందారు. వాంకిడి మండలం చైపన్ గూడ జీపీ ఖానాపూర్ లో పులి దాడి జరిగింది

Update: 2022-11-15 12:43 GMT

అడవుల్లో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి. ఆహారం కోసమో, తాగునీటి కోసమో అవి సమీప గ్రామాలకు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఇవి జరుగుతున్నాయి. మేత కోసం వెళ్లిన పశువులను తమ ఆహారంగా పులులు మార్చుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలో పులి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

జనం భయం భయంగా...
అసిఫాబాద్ జిల్లాలో పులి దాడి లో ఒక వ్కక్తి మృతి చెందారు. వాంకిడి మండలం చైపన్ గూడ జీపీ ఖానాపూర్ లో పులి దాడి జరిగింది. ఈ దాడిలో మృతి చెందిన వ్యక్తి శవం గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామస్థులు ఎవరూ బయటకు రావద్దని, పులి ఆచూకీ కనుగునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News