బెంగళూరులో 7 కోట్లు దోచుకెళ్లారు
బెంగళూరు నగరంలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు.
బెంగళూరు నగరంలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు. క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ వ్యాన్ నుంచి 7 కోట్ల 11 లక్షల రూపాయల భారీ దొంగతనం జరిగింది. జేపీ నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుంచి నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు వాహనం బయలుదేరింది. బండిలో కస్టోడియన్ అఫ్తాబ్, డ్రైవర్ బినోద్ కుమార్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్య ఉన్నారు. వ్యాన్ అశోకా పిల్లర్ వద్దకు రాగానే ఓ వైట్‌కలర్ టయోటా ఇన్నోవా అడ్డగించింది. తాము ఆర్‌బీఐ అధికారులమని అందులో నుండి దిగిన అధికారులు తెలిపారు. ఆర్‌బీఐ విచారణ జరుపుతోందని తమ వెంట రావాలన్నారు. డెయిరీ సర్కిల్ వద్ద వ్యాన్ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి కోట్ల రూపాయల నగదు తీసుకుని పరారయ్యారు.