బెంగళూరులో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్

పేలుళ్లకు ప్లాన్ చేసిన వారిలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్..

Update: 2023-07-19 06:59 GMT

bengaluru explosions

కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్రదాడికి జరుగుతున్న కుట్రను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భగ్నం చేశారు. నగరంలో పలుచోట్ల ఒకేసారి పేలుళ్లకు ప్లాన్‌ చేస్తున్నట్లు సీసీబీకి సమాచారం అందడంతో ఐదుగురు తీవ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన వారిలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. వారి నుంచి మొబైల్‌ ఫోన్లు, పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన ఐదుగురు నిందితులకు 2017లో జరిగిన ఓ హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆ కేసులో బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో.. వారికి కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, వారు పేలుడు పదార్థాలను తయారు చేయడంలో శిక్షణ పొందారని తెలిపారు. నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News