38 కిలోల బంగారం.. 60 కిలోల వెండి చోరీ
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా బర్హీ చౌక్‌లో భారీ దోపిడి జరిగింది.
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా బర్హీ చౌక్‌లో భారీ దోపిడి జరిగింది. పట్నా రోడ్డులోని ‘జై మాతా దీ జువెలర్స్’ దుకాణం నుండి 35 కిలోల బంగారం, 60 కిలోల వెండి, మూడు కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. దుకాణం మూసే సమయంలో రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు ఆభరణాల షాపులో పని చేసే సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల శబ్దాలకు చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. దోపిడీ అనంతరం దుండగులు పట్నా వైపు పారిపోయినట్లు దుకాణ యజమాని సురేంద్ర సోని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.