హాలిడే టైమ్.. 25 కోట్ల వజ్రల చోరీ
గుజరాత్‌లో 25 కోట్ల రూపాయల విలువైన వజ్రాల చోరీ చోటుచేసుకుంది.
గుజరాత్‌లో 25 కోట్ల రూపాయల విలువైన వజ్రాల చోరీ చోటుచేసుకుంది. సూరత్‌లోని కపోద్రా ప్రాంతంలో డీకే అండ్ సన్స్ డైమండ్ కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య ఈ సంఘటన జరిగింది. కంపెనీకి వరుసగా మూడురోజులు సెలవులు ప్రకటించడంతో దుండగులు మొదటగా కంపెనీ కింది అంతస్తులోని ప్రధాన ప్రవేశమార్గాన్ని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. మూడో అంతస్తుకు వెళ్లి బీరువాను గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి వజ్రాలను దోచుకెళ్లారు. సెలవుల అనంతరం సోమవారం కంపెనీ యూనిట్ యజమాని కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. దాదాపు 25 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు దోపీడీకి గురైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.