ఘోర రోడ్డుప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు

పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడంలేదని, వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని సూచించారు.

Update: 2023-01-08 05:18 GMT

china road accident

చైనాలోని జియాంగ్సి ప్రావిన్స్ లోని రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీ కొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో.. 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. వారందరికీ చికిత్స చేస్తున్నారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే.. నాన్ చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు మార్గదర్శకాలు సూచించారు. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడంలేదని, వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని సూచించారు. ముందు ప్రయాణించే వాహనానికి తగినంత దూరంగా ఉండాలని, లైన్ మారడం, ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించరాదని సూచించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే హెనాన్ ప్రావిన్స్ లోని ఓ బ్రిడ్జిపైన సుమారు 200 వాహనాలు ఒకదానినొకటి ఢీ కొనగా ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదానికి కూడా పొగమంచే కారణమైంది.




Tags:    

Similar News