Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడి పదిహేను మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్ పూర్ లో జిల్లా భాలూఘాట్‌ వద్ద భారీ కొండచరియలు విరిగిపడి ప్రైవేట్‌ బస్సుపై పడటంతో 15మంది దుర్మరణం పాలయ్యారు.

Update: 2025-10-08 02:06 GMT

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్ పూర్ లో జిల్లా భాలూఘాట్‌ వద్ద భారీ కొండచరియలు విరిగిపడి ప్రైవేట్‌ బస్సుపై పడటంతో 15మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు మట్టిలో చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఘటన సాయంత్రం 6.40 గంటల సమయంలో బెర్తిన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మారోతాన్‌ నుంచి ఘుమారివీకి వెళ్తున్న బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 15మందికి మృతదేహాలు వెలికి తీశారు. ఒక బాలుడితో పాటు మరికొందరు శిధిలాల కింద ఉన్నారని, వారి ప్రాణాలపై ఆశలు తగ్గిపోతున్నాయని అధికారులు తెలిపారు. అకస్మాత్తుంగా కొండ చరియలు విరిగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి

మృతులు వీరే...
మృతులలో నక్ష్‌, ఆరవ్‌, సంజీవ్‌, విమ్లా, కమలేష్‌, కాంతా దేవి, అంజనా, బక్షీ రామ్‌, నరేందర్‌ శర్మ, కృష్ణలాల్‌, చునీ లాల్‌, రజనీష్‌, సోను, షరీఫ్‌ ఖాన్‌, ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు సోదరులు అరుషి, శౌర్యలను సురక్షితంగా బయటకు తీశారు. వీరు బిలాస్ పూర్‌ ఏఐఐఎంఎస్‌లో చికిత్స పొందుతున్నారు. ఉపముఖ్యమంత్రి ముఖేష్‌ అగ్నిహోత్రి కులు దసరా కార్యక్రమం ముగించుకుని రాత్రి బిలాస్ పూర్‌ కు చేరుకుని రక్షణ చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బెర్తిన్‌ ఆస్పత్రిలోనే మృతదేహాల పోస్టుమార్టం పూర్తిచేస్తామని, ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య బంధువులకు మృతదేహాలు అప్పగిస్తామని ఆయన అని చెప్పారు.
వర్షాలు పడుతుండటంతో...
రెండు రోజులుగా పడుతున్న వర్షాల వల్లే కొండచరియలు పడి ప్రమాదం జరిగింది. అయినా ఘటనపై మేజిస్ట్రియల్‌ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. హిమాచల్‌ పర్వత ప్రాంతం కావడంతో రోడ్లు, వంతెనలు, సొరంగాలు నిర్మాణం జరుగుతోంది. ఈ అభివృద్ధి మోడల్‌ ఎంతవరకు స్థిరంగా ఉందో సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. 2023 నుంచి రాష్ట్రం 20వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నట్లు ఆయన వివరించారు. మండలమంతా వర్షాలు కురుస్తుండడంతో కొండలు బలహీనమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జె.పీ. నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘటనపై సంతాపం తెలిపారు. మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.


Tags:    

Similar News