Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. మొయినాబాద్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయాలయిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఎదురెదురుగా వస్తున్న...
మొయినాబాద్ హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఒకరు స్పాట్ లోనే మరణించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వీరు ఎవరు? ఎక్కడి వారన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.