Road Accident : అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు. అయతే ప్రమాదం జరిగిన మూడు రోజులతర్వాత ఘటన బయటకు వచ్చింది. అసోంలోని తీన్ సుకియా ప్రాంతానికి చెందిన కూలీలను తీసుకెళుతున్న ట్రక్కు లోయలోపడటంతో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా నేడు అది వెలుగులోకి వచ్చింది.
మూడు రోజుల క్రితం...
ఒక వ్యక్తి లోయలో నుంచి బయటకు వచ్చి సమాచారం అందించడంలో పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. టీ ఎస్టేట్ కుచెందిన 22 మంది కార్మికులతో బయలు దేరిన ట్రక్కు అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా జిల్లాలో లోయలోపడింది. సైన్యం సహాయక చర్యలు ప్రారంభించారు. వెయ్యి అడుగుల లోతు కావడంతో సహాయక చర్యలు కూడా కష్టంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.