Road Accident : చిన్న టేకూరు సమీపంలో మరో ప్రమాదం

కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో కంటైనర్ వాహనం ముందుకు వెళ్తున్న కార్లను ఢీకొట్టింది

Update: 2025-10-27 07:20 GMT

కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో కంటైనర్ వాహనం ముందుకు వెళ్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను రహదారి నుంచి పక్కకు తరలించారు. రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

బస్సు ప్రమాదం జరిగిన చోటే...
ప్రమాదానికి కారణమైన కంటైనర్‌ డ్రైవర్‌ వివరాలను పోలీసులు సేకరించారు. ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం పంథొమ్మిది మంది మృతి చెందగా, మిగతా ప్రయాణికులు కిటికీల గాజులు పగులగొట్టి బయటపడ్డ విషయం తెలిసిందే. అదే స్పాట్ లో మరో ప్రమాదం జరగడంతో పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News