Gold Rates Today : వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళుతున్నారు.. కొనుగోళ్లు లేవ్

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

Update: 2025-08-31 03:56 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం వరకూ కొంత దిగివచ్చినట్లు కనిపించినప్పటికీ తర్వాత మళ్లీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులకు మరింత భారంగా మారే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే సమయంలో సీజన్ సమయంలోనూ బంగారం ధరలు పెరుగుతుండటంతో వాటి ప్రభావం కొనుగోళ్లపై కూడా పడే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

వెండి ధరలు కూడా...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం, వెండి వస్తువులు అందుబాటులోకి రావడం లేదు. గత కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావంతో పాటు తీసుకున్న నిర్ణయాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ఆర్థిక మాంద్యంతో పాటు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం, దిగుమతుల్లో ప్రభావం వంటి అంశాలు బంగారం, వెండి ధరల్లో మార్పులకు కారణమని అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మొదలయిన ధరల పెరుగుదల మధ్యలో బ్రేకుల్లేకుండా కొనసాగుతూనే ఉంది.
ధరలు పెరిగి...
ఇప్పటికే దేశంలోబంగారం పది గ్రాములు కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయలుకు పైగానే వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది. అది ఆర్థిక స్థోమతకు మించిన విషయం కావడంతో వినియోగదారులు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ అయినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 96,200 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,04,950 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,31,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News