Gold Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధరలు...వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల

దేశంలో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో ఎక్కువగా పెరుగుదల కనిపించింది

Update: 2024-07-05 03:52 GMT

పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. వెండి ధరలు కూడా అంతే. బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని ఎప్పటి నుంచో అంచనాలు వినపడుతున్నాయి. మార్కెట్ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వీలయినంత త్వరగా బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఆషాఢమాసానికి ముందు ధరలు భారీ స్థాయిలో పెరగడంతో వినియోగదారులు కూడా ఆలోచనలో పడ్డారు. రానున్న సీజన్ లో ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరల అదుపు చేసేందుకు అవకాశం లేదని, పెరిగినా సీజన్ ప్రారంభం కాకముందే కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.

వచ్చే నెల నుంచి...
ఆగస్టు నుంచి మంచిముహూర్తాలున్నాయి. జులై నెల ఆషాఢ మాసం కావడంతో బంగారం, వెండి ధరలు పెరగవన్న అంచనాలు తప్పాయి. నిన్న మొన్నటి వరకూ స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. అయితే శుభకార్యాలు వచ్చేనెల నుంచి ప్రారంభం కానుండటంతో ఇప్పటి నుంచే కొనుగోలు చేయడం ప్రారంభించడం మేలని భావించి ధరలు పెరిగినా పెద్దగా సంకోచించకుండా జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. అందుకే తగ్గినప్పడు కొనుగోలు చేయాలన్న సూచనను అమలు చేస్తే మంచిదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారీగా పెరిగి...
దేశంలో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో ఎక్కువగా పెరుగుదల కనిపించింది. వెండి కిలో ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. పదిగ్రాముల బంగారం ధర 800 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర పదిహేను వందలు పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు నేడు కూడా చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,010 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 97,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News