Gold Prices Today : అక్షర తృతీయ రోజు అదిరిపోయే వార్త ఇక త్వరపడండి

దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Update: 2024-05-10 03:17 GMT

పసిడి చేతికి చిక్కడమంటే ఈరోజుల్లో అసాధ్యం. జేబు నిండా డబ్బులు అవసరం. ఎంత డబ్బులున్నా గ్రాము కొనాలంటే గగనమే అవుతుంది. అలా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లో తొమ్మిది వేల రూపాయల వరకూ బంగారం ధర పెరిగిందంటే దాని పరుగు ఎంత స్పీడ్ గా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే బంగారం, వెండి ధరలు కొనుగోలు చేయాలంటే గుండె దిటవు చేసుకుని జ్యుయలరీ దుకాణాల్లోకి అడుగుపెట్టాల్సిందనన్న సెటైర్లు సర్వత్రా వినిపిస్తుంటాయి.

ఖరీదైన వస్తువుగా...
బంగారం, వెండి అనేది ఇప్పుడు అతి ఖరీదైన వస్తువుగా మారింది. కొందరికే సొంతంగా మారే రోజులు ఎంతో దూరం లేదనిపిస్తుంది. ఇలా ధరలు పెరుగుతుండటం ఏ వస్తువులోనూ చూడం. డిమాండ్ ఏ మాత్రం తగ్గకపోవడం, ధరలు పెరిగిపోవడం, కొనుగోళ్లు రోజురోజుకూ పెరుగుతుండటం కూడా బంగారం ధరలు ప్రియమవ్వడానికి కారణాలుగా చెప్పాలి. పిండి కొద్దిగా అందరూ పంచుకోవాలంటే... అన్న సామెత పసిడికి సరిపోతుంది. అందుకే ఆ కొద్దిగా ఉన్న బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
నేటి ధరలు
అయితే అక్షర తృతీయ రోజు బంగారం ధరలు కొంత దిగివచ్చాయి. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధరలు కిలో వెండి పై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,150 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం హైదరాబాద్ మార్కెట్ లో 88,800 రూపాయలుగా ఉంది.



Tags:    

Similar News