Gold Prices Today : హమ్మయ్య కొంత శాంతించింది.. ఇక పెరగకుండా ఉంటే అంతే చాలు

నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి.

Update: 2024-04-15 04:26 GMT

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొందామంటే కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఈ బంగారం ధర ఎక్కడికిపోతుందన్న కంగారు, ఆందోళన కొనుగోలుదారుల్లోనూ నెలకొంది. బంగారానికి దూరంగానే ఉండటం మంచిదన్న అభిప్రాయం కలుగుతుంది. బంగారం శ్రీమంతులకు మాత్రమే చెందిన వస్తువుగా మారిపోయింది. అంటే దాని ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు.

పరుగులు తీస్తున్న...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. వాటికి అంతం ఎప్పుడు అన్న దానికి సమాధానం మాత్రం లేదు. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చేర్పులు ఉండటంతో బంగారం ధరలు ఆగే పరిస్థితి మాత్రం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు చూపుతున్నప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడం తప్పనిసరి కావడంతో కొందరు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. భవిష‌్యత్ లో బంగారం అనేది అతి ఖరీదైన వస్తువుగా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నేటి ధరలు ఇలా...
అయితే నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 66,490 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,540 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 88,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News