Gold Rate Today : గుడ్ న్యూస్... తగ్గుతున్న పసిడి ధరలు.. నేటి బంగారం ధరలు ఎంతంటే?

ఈరోజు మాత్రం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

Update: 2025-08-22 03:11 GMT

పసిడి అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే అది మన జీవనశైలిలో భాగమయింది. మన జీవితంలో ఒకటిగా మారింది. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలు, సంస్కృతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బంగారం, వెండి ఆభరణాల విషయంలో మహిళలు సెంటిమెంట్ గా భావిస్తారు. అందులోనూ భారత్ లో ఈ రకమైన భావన ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. కేవలం బంగారం అంటే సెంటిమెంట్ మాత్రమే కాదు స్టేటస్ సింబల్ గా కూడా చూస్తారు. కొన్ని దశాబ్దాల నుంచి అంటే పూర్వీకుల నుంచి బంగారానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఈ తరం వాళ్లు కూడా బంగారాన్ని విరివిగా కొనుగోలు చేస్తున్నారు.

ఆ తరం.. ఈతరం...
సాఫ్ట్ వేర్ జాబ్ ఉన్నప్పటికీ, ఆధునిక జీవన శైలికి అలవాటుపడినప్పటికీ బంగారం విషయంలో పాతతరం, నవతరం ఒక్కటిగానే కనిపిస్తుంది. బంగారం విషయంలో అందరి మైండ్ సెట్ ఒక్కటే. ఇందులో వయసుతో సంబంధం లేదు. జెండర్ తో కూడా నేటి రోజుల్లో పనిలేకుండా పోయింది. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. అయితే అనేక కారణాలతో బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఇంకా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాద్యం, యుద్ధాల వంటి కారణాలతో ప్రతి రోజూ బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
స్వల్పంగా తగ్గి...
ఇక గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు వినియోగదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లే అయింది. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ అనుకున్న స్థాయిలో బంగారం అమ్ముడు పోలేదని వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈరోజు మాత్రం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,00,760 రూపాయలుకు చేరుకుంది. కిలో వెండి ధర 1,26,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.




Tags:    

Similar News