Gold Prices Today : తగ్గిన బంగారం ధరలు.. అయినా ఇంకా అందుబాటులోకి మాత్రం రాలేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా పెరగకుండా కొంత తగ్గుదల కనిపించింది

Update: 2024-05-23 03:24 GMT

బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజుల నుంచి స్వల్పంగానే ధరలు తగ్గుతున్నాయి. అయితే తగ్గిన ధరలను చూసి ఎగిరి గంతేయాల్సిన సీన్ అయితే లేదు. ఎందుకంటే గ్రాముకు రూపాయి చొప్పున తగ్గుతూ బంగారం ఊరిస్తుందే తప్ప ధరలు పెరిగిన స్థాయిలో మాత్రం తగ్గడం లేదు. వెండి ధరలు కూడా అంతే. ఇప్పటికే లక్ష రూపాయలు కిలో వెండి ధర పలుకుతుంది. ఇలా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నట్లే కనిపిస్తున్నా తగ్గన్నట్లే భావించాల్సి ఉంటుంది.

ధరలు పెరగడానికి...
భారతీయ సంప్రదాయంలో బంగారం, వెండికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి కుటుంబం కూడా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తారు. కొద్దిగా డబ్బులుంటే చాలు జ్యుయలరీ దుకాణాలకు పరుగులు తీస్తారు. కానీ తమ వద్ద ఉన్న సొత్తుకు తాము ఆశించనంత బంగారం, వెండి లభించకపోవడంతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. ధరలు పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధాన మైన కారణం మాత్రం డిమాండ్ కు తగినట్లు సప్లయ్ లేకపోవడమేనన్నది వాస్తవం.
లక్షకు చేరిన వెండి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలలో కూడా పెరగకుండా కొంత తగ్గుదల కనిపించింది. అయితే పెద్ద మొత్తంలో మాత్రం కాదు. ఉదయం తగ్గుదల కనిపించినా మధ్యాహ్నానికి వాటి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68.290 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,500 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,00,400 గా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News