Gold Prices Today : గుడ్ న్యూస్.. బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి టైం అట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి.

Update: 2024-05-09 01:42 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దానిని ఆపడానికి కారణాలు మాత్రం దొరకవు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో మాంద్యం వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ధరలు ఎప్పటికప్పుడు మారుతుండటం ఒక్క బంగారం, వెండి వస్తువుల విషయంలోనే జరుగుతుంది. డిమాండ్, సప్లయ్ ఆధారంగా ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి.

కొనుగోళ్లు అధికంగా...
అయితే బంగారానికి కొనడానికి గతంలో శుభకార్యాలున్నప్పుడే కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు గోల్డ్ కొనడానికి ఒక రీజన్ అంటూ ఏమీ లేదు. తాము కొనదలచుకున్నప్పుడు కొనేయాల్సిందే. డబ్బులు తమ చేతిలో ఉంటే బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. బంగారం, వెండి ఆభరణాలు ఇష్టపడని వారు ఉండరు. ఎందుకంటే మహిళలకే బంగారం అంటే మక్కువ ఉండేది అన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పురుషులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి 
పరితపిస్తున్నారు
. ఆభరణాలను వేసుకుని తిరగడానికా కాదు కానీ, పొదుపు చేయడం కోసం భవిష్యత్ పై భరోసా కోసం కొనుగోలు చేయడం మొదలు పెట్టిన నాటి నుంచి డిమాండ్ పెరిగింది.
ఈరోజు ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,240 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,260 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 88,400 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News