Gold Price Today : హమ్మయ్య ఈరోజు ధరలు పెరగేలేదు కానీ.. మున్ముందు మాత్రం

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Update: 2024-05-05 02:21 GMT

దేశంలో బంగారం గిరాకీ ఎప్పుడూ తగ్గదు. బంగారం వన్నె తగ్గన్నట్లుగానే ధరలు కూడా దిగి వచ్చే అవకాశముండదు. బంగారం, వెండి వస్తువులకు భారతీయ సంప్రదాయంలో ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా వాటికి డిమాండ్ తగ్గడం అనేది జరగదు. బంగారం అంటే అదొక అపురూపమైన వస్తువుగా నేడు చూడటం లేదు. అవసరంగా మారిపోయింది. సమాజంలో గౌరవప్రతిష్టలు కావాలంటే బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందేనన్న భావనకు కొనుగోలుదారులు రావడమే ఇందుకు కారణం.

డిమాండ్ తగ్గని....
మరోవైపు మహిళలు అత్యంత ఇష్టపడే బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో పాటు నిల్వలు పెరగకపోవడం వల్లనే ధరలు అదుపులోకి రావడం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. బంగారం, వెండి వస్తువుల ఇంట్లో ఎంత ఎక్కువగా ఉంటే అంత శుభప్రదమని మాత్రమే కాకుండా కష్టకాలంలో తమను ఆదుకుంటాయన్న నమ్మకంతోనే మరింత డిమాండ్ పెరిగింది. మూఢమిలోనూ బంగారం కొనుగోళ్లు ఆగడం లేదు.
నిలకడగా నేడు...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల వరసగా బంగారం, వెండి ధరలు కొంత దిగి వస్తున్నాయి. తిరిగి అక్షర తృతీయ సమయానికి ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,850 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71830 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 83,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News