New SIM: మీరు కొత్త సిమ్‌ తీసుకుంటున్నారా? డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌

ప్రతి నెల రాగానే ఒకటో తేదీ నుంచి కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. వినియోగదారులు ఎలాంటి రూల్స్‌ ఉన్నాయో

Update: 2023-11-24 03:45 GMT

ప్రతి నెల రాగానే ఒకటో తేదీ నుంచి కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. వినియోగదారులు ఎలాంటి రూల్స్‌ ఉన్నాయో ముందుస్తుగా తెలుసుకోవడం ముఖ్యం. లేకుంటే ఇబ్బందులతో పాటు ఆర్థిక నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి సిమ్‌ కార్డు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. మీరు కొత్త సిమ్ కొనాలని ప్లాన్ చేసినా లేదా సిమ్ కార్డ్ కొన్నా.. ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. నకిలీ సిమ్‌లతో కూడిన మోసాలును అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిబంధనలను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ సిమ్ కార్డ్‌ల కొనుగోలు, అమ్మకాల కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. అయితే గత అక్టోబర్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనా.. దానిని వాయిదా వేసి డిసెంబర్‌ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

సిమ్ డీలర్ వెరిఫికేషన్: సిమ్ కార్డ్ డీలర్లందరూ తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలి. నిబంధనను పాటించడంలో విఫలమైతే 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. టెలికాం ఆపరేటర్లు పోలీస్ వెరిఫికేషన్‌కు బాధ్యత వహిస్తూ, సిమ్‌లను విక్రయించడానికి నమోదు చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. కస్టమర్లు తమ ప్రస్తుత నంబర్‌ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే, ఆధార్ స్కానింగ్, డెమోగ్రాఫిక్ డేటా సేకరణ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

బల్క్ సిమ్ కార్డ్ జారీ: సిమ్ కార్డ్‌ల జారీల విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. వ్యక్తులు వ్యాపార నిమిత్తం కనెక్షన్ ద్వారా మాత్రమే పెద్దమొత్తంలో సిమ్ (SIM) కార్డ్‌లను పొందగలుగుతారు. కస్టమర్లు ఒక IDపై మునుపటిలాగా 9 SIM కార్డ్‌లను పొందే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సిమ్ కార్డ్‌లు పెద్దమొత్తంలో జారీ చేయడం అంటూ ఉండదు. SIM కార్డ్‌ని బ్లాక్ చేసి.. ఆ నంబర్ 90 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే మరొక వ్యక్తికి కేటాయిస్తారు. కొత్త నిబంధనలకు లోబడి ఉండటానికి సిమ్ అమ్మకం విక్రేతలు నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి. ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రిజిస్ట్రేషన్ లేకుండా..: ఈ ఎమర్జెన్సీ నంబర్ లేకుండా ఎవరూ సిమ్‌ కార్డ్‌ని విక్రయించలేరు. ఇప్పుడు ఒక రిటైల్ స్టోర్ DoT కింద నమోదు చేసుకోవడానికి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, జీఎస్టీ వివరాలను అందించాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ దుకాణం సిమ్ కార్డును విక్రయించేందుకు వీలుండదు. ఈ రిజిస్ట్రేషన్ లేకుండా దుకాణాదారులు సిమ్‌ కార్డ్‌లను విక్రయిస్తే, దాని ID బ్లాక్ చేయబడుతుంది. అంతే కాకుండా దుకాణదారునికి జరిమానా విధిస్తారు. అలాగే ఒక వ్యక్తి సిమ్ కార్డును పోగొట్టుకున్నా లేదా సిమ్ కట్ చేసినా, అతను వెరిఫికేషన్ ప్రక్రియకు వెళ్లాలి. జియో, ఎయిర్‌టెల్, వి, బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులను విక్రయించడానికి ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అందుకే ఇబ్బడి ముబ్బడిగా సిమ్‌ కార్డులను తీసుకుంటే బ్లాక్‌ చేయించుకోవడం, లేదా అలాగే వదిలేసి వేరే సిమ్‌ కార్డులను తీసుకోవడం మంచిది కాదు. లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది.

click here to know about e sim 

Tags:    

Similar News