వెండి ధర ఎంత పెరిగిందో ఈ రోజు తెలిస్తే?
వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు కిలో వెండి ధరపై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధరలు 2.37 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇక మూడు లక్షల రూపాయలకు చేరుకునే రోజు ఎంతో దూరం లేదని తెలిపింది.
బంగారం ధరలు కూడా...
ఈ నెల 18వ తేదీ నుంచి వెండి ధర దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయలు పెరిగింది. గత ఏడాది కంటే బంగారం ధర ప్రస్తుతం 70 శాతానికి పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,350 రూపాయలు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పలుకుతుంది. బంగారం, వెండి ధరలు రమింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.