ఒక్కరోజులోనే ఇరవై వేలు పెరిగిన వెండి ధర
దేశంలో వెండి ధరలు భారీగా పెరిగాయి
దేశంలో వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజు కిలో వెండి ధరలపై ఇరవై వేల రూపాయలు పెరిగింది. బంగారంతో పాటు వెండి సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయని భావించి మదుపరులు ఎక్కువగా వెండిపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో వెండి ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఆల్ టైం గరిష్టానికి వెండి ధరలు చేరుకుంటున్నాయి.
కిలో వెండి ధర...
హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,75,000 రూపాయలకు చేరుకుంది. బంగారం ధరలను మించి వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో వెండిపై పెట్టుబడి పెట్టే వారు కూడా అధికంగా కనిపిస్తున్నారు. దీంతో మదుపరులు ఎక్కువగా వెండిపై పెట్టుబడులు పెట్టడం కూడా ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.