Silver Prices : వెండి కొన్న వారికి షాకింగ్ న్యూస్
భారీగా వెండి ధర పడిపోయింది.
భారీగా వెండి ధర పడిపోయింది. ఒక్క రోజులో 21,500 రూపాయలు కిలో వెండి ధర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర2,33,120 రూపాయలకు చేరింది. గతకొద్ది రోజులుగా వెండి ధరలు పెరుగుతున్నాయి. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ముందుగానే అంచనా వేశారు. వెండి ధరలు పతనమవుతాయని, బంగారం ధరలు అంత త్వరగా దిగిరావని పేర్కొన్నారు.
మార్కెట్ నిపుణుల అంచనాల మేరకే...
వారి అంచనాలకు తగినట్లుగానే వెండి ధరల్లో ఈరోజు భారీగా పతనం కనిపించింది. వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వెండి ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎక్కువ మంది వెండి పై మదుపు చేయడం ప్రారంభించారు. తక్కువ కాలంలో అధిక లాభాలను ఆర్జించవచ్చని వెండి పై పెట్టుబడులు పెట్టారు. కానీ వారందరికీ వెండి ధరలు తగ్గి షాకిచ్చినట్లయింది.